గుంటూరు జిల్లా బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో వార్డు సచివాలయ ఉద్యోగులు సెమీ క్రిస్మస్ వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఉప సభాపతి కోన రఘుపతి హాజరయ్యారు. కేకును కోసి అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. యేసు చూపిన మార్గంలో నడిచి జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని ఆకాంక్షించారు. వేడుకకు పురపాలిక కమిషనర్ భానుప్రతాప్, అధికారులు, నాయకులు, సచివాలయ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
యేసు బాటలో నడిచి.. ఆనందంగా ఉండండి: ఉప సభాపతి - గుంటూరు సమాచారం
యేసు క్రీస్తు చూపిన మార్గంలో నడిచి జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని ఉప సభాపతి కోన రఘుపతి అన్నారు. గుంటూరు జిల్లా బాపట్ల వార్డు సచివాలయాల ఉద్యోగులు ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేక్ కట్ చేశారు.
యేసు క్రీస్తు చూపిన మార్గంలో నడిచి జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి: ఉప సభాపతి