ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మా పార్టీ ఆర్చ్​ను కూల్చిన వారిపై చర్యలు తీసుకోండి' - నుదురుపాడులో తెదేపా ధర్నా వార్తలు

తెదేపాకు చెందిన ఆర్చ్​ను వైకాపా నాయకులు కూల్చేశారని గుంటూరు జిల్లా నుదురుపాడులో నేతలు ధర్నా చేశారు. ఆర్చ్​ని పడగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెదేపా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Demolition of the tdp Arch at Nudurupadu
నుదురుపాడులో తెదేపాకు చెందిన ఆర్చ్​ కూల్చివేత

By

Published : Nov 30, 2020, 6:34 PM IST

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం నుదురుపాడు గ్రామంలో తెదేపాకు చెందిన ఆర్చ్​ని అధికార పార్టీకి చెందిన నాయకులు ఉద్దేశపూర్వకంగా పడగొట్టారని నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్చ్​ని కూల్చేయడం దారుణమని మాజీ ఎంపీపీ పెరికల అన్నమ్మ అన్నారు. వైకాపా దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చి దళితులపై కపట ప్రేమ చూపిస్తోందని మండిపడ్డారు.

నుదురుపాడులో గత ప్రభుత్వం కోటిన్నర రూపాయలు పెట్టి ఎన్టీఆర్ గృహాలు, సీసీ రోడ్లను నిర్మించారని.. వాటి గుర్తుగా ఆర్చ్ ఏర్పాటు చేసుకుంటే దాని కూల్తివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వానికి కూల్చివేయడం తప్ప కట్టడం చేత కాదని తేదేపా జిల్లా బీసీ సెల్ నాయకులు పసల థామస్ ఎద్దేవా చేశారు. ఆర్చ్ కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details