'రైతుల అరెస్ట్ దారుణం, వెంటనే విడుదల చేయండి' - గుంటూరులో అమరావతి నిరసనలు
అమరావతికి మద్దతుగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను అన్యాయంగా అరెస్ట్ చేసి బెయిల్ ఇవ్వకుండా వేధిస్తున్నారని అమరావతి దళిత ఐకాస నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా జైలుకి వచ్చి జైలులో ఉన్న ఆరుగురు రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ ఇప్పటికైనా మనసు మార్చుకుని అమరావతిని శాశ్వత రాజధానికి ప్రకటించాలన్నారు.
గుంటూరులో ఆందోళన చేస్తున్న అమరావతి దళిత ఐకాస నాయకులు