సైబర్ నేరస్తులు పంథా మార్చారు. కొవిడ్ నేపథ్యంలో నయా దందా మొదలుపెట్టారు. ఆరోగ్యశ్రీ పేరుతో నగదు దోచుకునేందుకు సిద్ధమవుతున్నారు. మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా.. ప్రభుత్వం నుంచి మీ అకౌంట్‌కి కొంత నగదు పంపుతాం అంటూ ఫోన్ చేస్తారు. మీ అకౌంట్లో ప్రస్తుతం ఎంత డబ్బు ఉంది.. మీది డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు నెంబర్, సీవీవీ, ఓటీపీ చెప్పండి అంటూ మాయమాటలు చెపుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో డా.మల్లిఖార్జున తెలిపారు. దీనికి సంబంధించి ఒక ఆడియో క్లిప్పింగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందన్నారు.
తస్మాత్ జాగ్రత్త.. ఆరోగ్య శ్రీ పేరుతో ఆన్లైన్ మోసం
ఆరోగ్య శ్రీ అంటారు... మీ అకౌంట్లో నగదు వేస్తామంటారు... మీ ఖాతా నుంచే డబ్బు దొంగలించేందుకు సైబర్ నేరగాళ్ల కొత్త దారి ఇది. సైబర్ మోసగాళ్లు కరోనా సమయాన్ని సైతం వదలకుండా ప్రజలను మోసం చేసేందుకు సిద్ధం అవుతున్నారని ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో తెలిపారు.
ఆరోగ్య శ్రీ పేరుతో ఆన్లైన్ మోసం
ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి ఎవ్వరికీ ఫోన్ చేయరని సీఈవో స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ ఆఫీసు మీ బ్యాంకు వివరాలు ఓటీపీ ఎప్పుడూ అడగరన్నారు. ఈ తరహా ఫోన్ కాల్స్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు ఈ తరహా నేరాలపై జాగ్రత్తగా ఉండాలన్నారు.
ఇదీ చదవండి: