ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రభుత్వం స్పదించే వరకు దీక్ష విరమించేది లేదు' - guntur news updates

గుంటూరు కలెక్టరేట్ వద్ద కొవిడ్ వారియర్ల ఆమరణ నిరాహార దీక్ష రెండోరోజుకు చేరింది. కరోనా సమయంలో విధులు నిర్వర్తించిన తమను, ఉద్యోగం నుంచి తొలగించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

covid variars hunger strike reached second day in guntur
గుంటూరు కలెక్టరేట్ వద్ద కొవిడ్ వారియర్ల ఆమరణ నిరాహార దీక్ష

By

Published : Mar 21, 2021, 3:18 PM IST

ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ... గుంటూరు కలెక్టరేట్ వద్ద కొవిడ్ వారియర్లు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష రెండో రోజుకు చేరింది. ప్రాణాలను ఫణంగా పెట్టి, కరోనా సమయంలో విధులు నిర్వహించిన తమను ఇప్పుడు తొలగించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారుల తీరుతో... తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు. రెండురోజులుగా ఆమరణ దీక్ష చేపట్టినప్పటికీ... ప్రభుత్వం స్పందించకపోవటం దారుణమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యపై ప్రభుత్వం స్పందించే వరికు దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details