మంగళగిరి ఎయిమ్స్‌లో కొవిడ్ టీకా ప్రారంభమైంది. ఆస్పత్రి సంచాలకులు డాక్టర్ ముఖేశ్ త్రిపాఠి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి కొవిషీల్డ్ టీకాను డాక్టర్ ముఖేశ్, నర్సింగ్ అధికారి ధనశేఖరన్, ఎయిమ్స్ డీన్ డా.జాయ్ తీసుకున్నారు. ఆస్పత్రిలోని వైద్యులు, నర్సులకు టీకాను అందిస్తామని డా. ముఖేశ్ చెప్పారు. టీకా వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని..అత్యంత సురక్షితమైనదని చెప్పారు. ఎలాంటి భయం లేకుండా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ మాస్క్ ధరించటం, శానిటైజేషన్, భౌతిక దూరం పాటించాలని తెలిపారు.
మంగళగిరి ఎయిమ్స్‌లో కొవిడ్ టీకా ప్రారంభం
గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో కొవిడ్ టీకా ప్రారంభమైంది. ఎయిమ్స్ సంచాలకులు డాక్టర్ ముఖేశ్ త్రిపాఠి టీకా ప్రక్రియను మొదలు పెట్టారు.
కొవిడ్ టీకా ప్రారంభం