గుంటూరు జిల్లాలోని నగరపాలక, పురపాలక సంస్థల కమిషనర్లతో కొవిడ్ నివారణ, నియంత్రణపై కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ సమీక్షా నిర్వహించారు. ఆరోగ్య కార్యకర్తలు ప్రతి ఇంటిలో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారని, 60 ఏళ్లకు పైబడిన వారిని గుర్తించి వారి శరీర ఉష్ణగ్రతలు, బీపీ, షుగర్ వివరాలను కొవిడ్ ట్రాకర్ యాప్ లో పొందుపర్చాలని చెప్పారు. అప్ లోడ్ చేసిన వివరాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వారికీ అందుతాయని.. దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటారని కలెక్టర్ వెల్లడించారు.
వైరస్ నియంత్రణలో భాగంగా 'కొవిడ్ ట్రాకర్ యాప్' - గుంటూరు కొవిడ్ ట్రాకర్ యాప్ న్యూస్
గుంటూరు జిల్లాలో కొవిడ్ నియంత్రణలో భాగంగా కొవిడ్ ట్రాకర్ గుంటూరు యాప్ను ప్రవేశపెట్టారు. వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్నవారి వివరాలను ఈ యాప్లో పొందుపర్చాలని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ చెప్పారు.
వైరస్ నియంత్రణలో భాగంగా 'కొవిడ్ ట్రాకర్ యాప్'