ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గురజాలలో నలుగురికి కరోనా పాజిటివ్

గుంటూరు జిల్లా గురజాల పట్టణంలో కరోనా కేసులు మొదలయ్యాయి. ఇప్పటివరకూ గ్రీన్ జోన్​గా ఉన్న పట్టణంలో నలుగురు కరోనా బారినపడ్డారు. అందులో ఇద్దరు టీ స్టాల్ నిర్వాహకులు కావటంతో పట్టణ ప్రజలంతా భయబ్రాంతులకు గురవతున్నారు.

By

Published : Jul 7, 2020, 5:45 PM IST

covid cases started in guntur dst gurajala
covid cases started in guntur dst gurajala

గుంటూరు జిల్లా గురజాల పట్టణంలో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. లాక్‌ డౌన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు గురజాల పట్టణం గ్రీన్ జోన్​గా ఉంది. రాజస్థాన్ నుంచి వచ్చిన టీస్టాల్ నిర్వాహకులు ఇద్దరు కరోనా బారిన పడ్డారు. గురజాల రెవెన్యూ కార్యాలయంలో ఓ ఉద్యోగికి, జంగమహేశ్వరపురంలో ఒకరికి కరోనా పాజిటివ్ అని అధికారులు నిర్ధారించారు.

అధికారులు... ఆ నలుగురు వ్యక్తుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించే పనిలో పడ్డారు. ఆ నలుగురిలో ఇద్దరు టీ స్టాల్ నిర్వాహకులు కావటంతో పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిత్యం వందలాది మంది ఆ రెండు టీ స్టాళ్లకు వస్తుంటారు.

మరోవైపు రెవెన్యూ కార్యాలయంలో ఉద్యోగికి పాజిటివ్ రావటంతో కార్యాలయ సిబ్బంది ఉలిక్కిపడ్డారు. రెవెన్యూ కార్యాలయానికి నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో అక్కడి సిబ్బంది, ఉద్యోగులు కలవరపడుతున్నారు.

ఇదీ చూడండి

రూ.20వేల కోట్ల ఆస్తిని...30 లక్షల కుటుంబాలకు ఇవ్వబోతున్నాం: సీఎం

ABOUT THE AUTHOR

...view details