గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల సరిహద్దు ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పాసులతో ఏపీలోకి ప్రవేశిస్తున్న వారిని సరిహద్దుల్లోనే పోలీసులు పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలోకి వచ్చేవారికి సాధారణ పరీక్షలు నిర్వహించి..వారి పూర్తి వివరాలు తీసుకుని అప్పుడు వారి స్వస్థలాలకు పంపిస్తున్నారు.
రాష్ట్రంలో అడుగుపెట్టే ముందే.. సరిహద్దుల్లో కోవిడ్ పరీక్షలు
తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి వస్తున్న ప్రజలకు ప్రభుత్వం కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం పాసులు ఇచ్చినా ముందస్తు చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
corona test in ap borders
తెలంగాణ రాష్ట్రం నుంచి పాస్ లేకుండా ఆంధ్రాలోకి వచ్చిన వారికి కరోనా పరీక్షలు నిర్వహించి.. ఏమైనా అనుమానం ఉంటే వారిని వెంటనే గుంటూరు తరలిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసు ముందస్తు చర్యగా ప్రజల పూర్తి వివరాలు నమోదు చేసుకొని స్పందన కార్యక్రమం ద్వారా వారికి ఒక గుర్తింపు కార్డును ఇస్తున్నారు.
ఇవీ చదవండి:హైకోర్టు తీర్పును గౌరవించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు: నిమ్మగడ్డ