గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. జిల్లాలో కొత్తగా 226 మందికి కరోనా సోకింది. తాజా కేసులతో.. మొత్తం కేసుల సంఖ్య 70 వేల 386కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరంలోనే 72 నమోదయ్యాయి. మంగళగిరిలో 15 కేసులు, తెనాలిలో 11 కేసులు, తాడేపల్లిలో 9, వట్టిచెరుకూరు, అమర్తలూరులో 8 కేసులు చొప్పున నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 65 వేల 802 మంది ఇంటికి చేరుకున్నారు. కరోనా మరణాల సంఖ్యను పూర్తిగా నిరోధించాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. జీజీహెచ్లో 20వేల కిలోలీటర్ల సామర్ధ్యం గల ఆక్సిజన్ ప్లాంటు అందుబాటులోకి రావడంతో జీజీహెచ్లో అవసరమైన రోగులందరికీ ఆక్సిజన్ అందించగలుగుతున్నారు. మరో 50 బెడ్లతో ఐసీయూ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
జిల్లాలో కొత్తగా 226 మందికి కరోనా పాజిటివ్ - గుంటూరు జిల్లా తాజా వార్తలు
గుంటూరు జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 226 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా మరణాల సంఖ్యను పూర్తిగా నిరోధించాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరంలోనే 72 ఉన్నాయి.
corona cases