ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో కొత్తగా 12 కేసులు... 555కు పెరిగిన బాధితులు - గుంటూరు జిల్లాలో కరోనా కేసులు తాజా వార్తలు

గుంటూరు జిల్లాలో కొత్తగా 12 కరోనా కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వస్తున్న వారి ద్వారా పాజిటివ్ కేసులు పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇతర ప్రాంతాల నుంచి ఎవరొచ్చినా క్వారంటై​న్​లో ఉండాలని సూచిస్తున్నారు.

corona cases in guntur district
గుంటూరు జిల్లాలో కొనసాగుతోన్న కరోనా కేసులు

By

Published : Jun 4, 2020, 3:03 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. కొత్తగా 12 పాజిటివ్ కేసులు నమోదైన కారణంగా జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 555కు చేరుకుంది. ఇవాళ నమోదైన వాటిలో గుంటూరు నగరంలోని ముత్యాలరెడ్డి నగర్​లో 2, ఎల్.బీ. నగర్​లో 2, తాడేపల్లిలో 4, మంగళగిరిలో 1 కేసు ఉన్నాయి. దిల్లీ నుంచి వచ్చిన ముగ్గురికి పాజిటివ్​గా తేలింది. వారందరినీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వచ్చిన కేసులతో కలిపి గుంటూరు నగరంలో కరోనా బాధితుల సంఖ్య 214కు పెరిగింది.

ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి వస్తున్న వారి ద్వారా కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు తప్పనిసరిగా క్వారంటైన్​లో ఉండాలని సూచిస్తున్నారు. కరోనా నిర్ధరణ పరీక్షలు పూర్తయిన తర్వాతే వారు స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి రైళ్లలో వచ్చే అందరికీ పరీక్షలు చేస్తున్నారు. మిగతా రాష్ట్రాల నుంచి వచ్చేవారికి ర్యాండమ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details