గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నవులూరు గ్రామంలో ఇద్దరు సచివాలయ ఉద్యోగులకు కరోనా వచ్చింది. ఇదే గ్రామంలో సోమవారం జరిపిన పరీక్షల్లో ఓ మహిళకు, ఒక విద్యార్థికి పాటిజివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మహిళను ఐసోలేషన్‌కు తరలించారు. విద్యార్థి ఐసోలేషన్‌కు రానని మొండికేయడంతో ఇంట్లోనే వదిలిపెట్టారు.
మంగళగిరలో విజృంభిస్తున్న కరోనా
కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తూనే ఉంది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఒకేసారి ఇంతమందికి పాజిటివ్ నిర్ధరణ కావడం భయాందోళనకు గురిచేస్తోంది.
corona cases are rises in mangalagiri mandal in guntur district
పెదవడ్లపూడిలో ఓ పాఠశాల డ్రైవర్‌కు కరోనా సోకింది. మంగళగిరి రత్నాల చెరువుకు చెందిన ఓ వ్యక్తి ద్వారా డ్రైవర్‌కు సక్రమించినట్లు తేలింది. దుగ్గిరాల పసుపు యార్డు సమీపంలో ఓ వ్యక్తికి కరోనా సోకడంతో ఈనెల 15 వరకు... యార్డుకు సెలవులు ప్రకటించారు.
ఇదీ చదవండి:మద్యం కోసం తల్లిని చంపిన కొడుకు అరెస్ట్