ఇంధన ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ.. నరసరావుపేటలో ప్రజాసంఘాల నేతలు నిరసన చేపట్టారు. స్థానిక మార్కెట్ సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు గ్యాస్ సిలిండర్‌తో శవయాత్ర చేశారు. గ్యాస్, పెట్రోల్ ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగ్గించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం నరసరావుపేట సబ్ కలెక్టర్ శ్రీనివాస్ పూర్‌కు వినతిపత్రం అందజేశారు.
నరసరావుపేటలో ఇంధన ధరలకు వ్యతిరేకంగా నిరసన - నరసరావుపేటలో ప్రజాసంఘాల నిరసన
గుంటూరు జిల్లా నరసరావుపేటలో పెరిగిన ఇంధన ధరలకు వ్యతిరేకంగా.. ప్రజాసంఘాల నేతలు వినూత్న ప్రదర్శన నిర్వహించారు. గ్యాస్, పెట్రోల్ ధరలను తగ్గించాలంటూ.. నినాదాలు చేశారు.
నరసరావుపేటలో ఇంధన ధరలకు వ్యతిరేకంగా నిరసన