గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో వసతులను జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ఆకస్మికంగా పరిశీలించారు. తనిఖీలు చేశారు. ఆస్పత్రిలో వివిధ వార్డుల్లో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. రోగులకు సహాయంగా వచ్చిన వారి ఫిర్యాదులపై స్పందించారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పిల్లల వార్డులో అనేక సమస్యలు ఉన్నాయని కలెక్టర్ ఆగ్రహించారు. సరైన వసతులు లేక ఒక మంచం పై ఇద్దరు ముగ్గురు పిల్లల తల్లులు ఉన్నారని.. అక్కడ సరైన సౌకర్యాలు లేవన్నారు. మరుగుదొడ్ల నిర్వహణలో నాణ్యత లోపించిందని.. కొన్ని చోట్ల పూర్తిగా బ్లాక్ అయినట్లు గమనించామనీ చెప్పారు. తమ పరిధిలోని సమస్యలను.. సత్వరమే పరిష్కరిస్తామన్నారు. రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాల్సిన వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని వెల్లడించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ శామ్యూల్ ఆనంద్... ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అన్ని వార్డులను పరిశీలించారు.
కలెక్టర్