గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదవడంతో ముఖ్యమంత్రి నివాసం ఉండే ప్రాంతం బఫర్‌జోన్‌లోకి వెళ్లింది. నిబంధనల ప్రకారం కరోనా పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతం నుంచి కిలోమీటరు వరకు రెడ్‌జోన్ అని, మూడు కిలోమీటర్ల పరిధిని క్లస్టర్ కంటైన్మెంట్ జోన్‌గా, ఏడు కిలోమీటర్ల పరిధిని బఫర్‌జోన్‌గా అధికారులు ప్రకటించారు. పాజిటివ్ కేసు నమోదైన తాడేపల్లి పట్టణంలోని డోలాస్‌నగర్ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి నివాసం ఏడు కిలోమీటర్ల పరిధిలోపల ఉన్నట్లు గూగుల్ మ్యాప్ ద్వారా అధికారులు గుర్తించారు. పాజిటివ్ కేసు నమోదైన డోలాస్ ప్రాతం నుంచి ఒక కిలోమీటర్ పరిధిలో 3,982 గృహలతో పాటు 11,180 జనాభా రెడ్‌జోన్‌లోకి వస్తున్నట్లు వెల్లడించారు.
ముఖ్యమంత్రి నివాసానికి కరోనా ఎఫెక్ట్
తాడేపల్లి కరోనా పాజిటివ్ కేసు సీఎం నివాసం వరకూ చేరింది. ముఖ్యమంత్రి నివాసం సైతం బఫర్‌జోన్‌లోకి వెళ్లినట్లు అధికారులు గూగుల్ మ్యాప్ ద్వారా గుర్తించారు.
Chief Minister Jagan's residence in Buffer Zone at thadepalli in guntur
గుంటూరు జిల్లావ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 122కి చేరుకుంది. రాష్ట్రంలో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాగా గుంటూరు కొనసాగుతోంది.