మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్టు చేయటంపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేశారని అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని... హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ అరెస్టును బలహీనవార్గాలపై దాడిగా చంద్రబాబు అభివర్ణించారు.
అచ్చెన్నాయుడి కిడ్నాప్‌నకు జగన్ బాధ్యత వహించాలి: చంద్రబాబు - achennanaidu arrest
మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్టును చంద్రబాబు ఖండించారు. అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేశారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు ఈ చర్య జగన్ కుట్ర అని ధ్వజమెత్తారు.
చంద్రబాబు ఆగ్రహం
జగన్ కుట్రలో భాగంగానే అసెంబ్లీకి నాలుగు రోజుల ముందు అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారని అన్నారు. డీజీపీ....అచ్చెన్నాయుడి ఆచూకీ తెలపాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు, మేధావులు ,ప్రజలు నిరసన తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా...వంద మంది ఒకేసారి అచ్చెన్నాయుడి ఇంట్లోకి చొరబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పిచ్చి పరాకాష్టకు చేరిందని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి:మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు
Last Updated : Jun 12, 2020, 1:57 PM IST