నీతి, నిజాయితీపరులకే ఓటేయాలని ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ గుంటూరులో విజ్ఞప్తి చేశారు. దొంగలకు ఓటు వేసి తర్వాత బాధ పడేకంటే... ముందుగానే ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిదన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. విభజన హామీలను ఎందుకు ఇవ్వలేక పోతున్నారో రాష్ట్ర ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలే వారికి బుద్ధి చెబుతారన్నారు.
దొంగలకు ఓటేసి తర్వాత బాధపడవద్దు: చలసాని
ఎవరైతే నిజాయితీపరుడుగా అనిపిస్తారో వారికే ఓటు వేయండి. ఎవరి ప్రలోభాలకు లొంగవద్దు. ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నారో ఒకటికి 2సార్లు ఆలోచించి ఎన్నుకోండి. లేదంటే మరో ఐదేళ్లు బాధ పడాల్సి వస్తుంది. -చలసాని శ్రీనివాస్, ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్.
నిజాయితీ పరులకు ఓటేయాలని అభ్యర్థిస్తున్న చలసాని
TAGGED:
చలసాని శ్రీనివాస్