CBI Ex JD Laxmi Narayana : అమరావతి పాదయాత్రకు అడ్డంకులు సృష్టించడం సరికాదని.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. కేవలం భవనాలు నిర్మిస్తే అభివృద్ధి జరిగినట్లు కాదని, ప్రజలకు అన్నిరకాల వసతులు, ఉద్యోగాలు కల్పించినప్పుడే ప్రగతి సాధించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ జిల్లా అభివృద్ధి రాజధాని కావాలని ఆకాంక్షించారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే చంద్రబాబు- పవన్ భేటీ అని అన్నారు. ఎన్నికల్లో విశాఖ నుంచి స్వతంత్రంగా పోటీ చేయనున్నట్లు లక్ష్మీనారాయణ వెల్లడించారు.
వచ్చే ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ: సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ
CBI Ex JD Laxmi Narayana: అమరావతి పాదయాత్రకు కలిగిస్తున్న అడ్డంకులపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. ప్రజలకు అన్నిరకాల వసతులు, ఉద్యోగాలు కల్పించినపుడే ప్రగతి సాధించినట్లని ఆయన వ్యాఖ్యనించారు. వచ్చే ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలిపారు.
Etv Bharat