ఉచిత వైద్య పరీక్షలు
శివలింగప్రసాద్ విదేశాల్లో ఉన్నా ... తమ గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఆయన తల్లితో పాటు బంధువుల్లో ఎక్కువ మంది క్యాన్సర్తో మరణించారు. అందుకే తమ గ్రామంలో ఉచితంగా క్యాన్సర్ వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని సంకల్పించారు. తన తల్లిదండ్రులు పండా వెంకట సుబ్బయ్య, లక్ష్మి నరసమ్మ జ్ఞాపకార్థం సంగం జాగర్లమూడిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం వైద్యశిబిరం నిర్వహించారు. క్యాన్సర్తో పాటు ఇతర జబ్బులకు సంబంధించిన వైద్యశిబిరం కూడా ఏర్పాటు చేశారు. సంగం జాగర్లమూడితో పాటు సమీప గ్రామాల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రితో పాటు విజయవాడ, గుంటూరు నుంచి వైద్య నిపుణులు హాజరై అన్ని పరీక్షలు ఉచితంగానే నిర్వహించారు.
కెనడా మంత్రి.. సంగం జాగర్లమూడిలో సేవలు
జన్మభూమి కన్నతల్లితో సమానం. అందుకే పుట్టిన గడ్డను మరువకూడదంటారు పెద్దలు. ఈ మాటలనే స్ఫూర్తిగా తీసుకుని గుంటూరు జిల్లాకు చెందిన పండా శివలింగప్రసాద్... అనే ప్రవాసాంధ్రుడు తన స్వగ్రామంలో సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. కెనడాలోని ఓ రాష్ట్రానికి మంత్రిగా ఉన్నతస్థాయిలో ఉన్న ఆయన సొంత గ్రామానికి తన వంతు సాయం చేస్తున్నారు.
పండా ప్రసాద్
అందరిలో ఒకడిగా..
సంగం జాగర్లమూడికి వచ్చిన ప్రసాద్ ఇక్కడ తన చిన్ననాటి సంగతుల్ని నెమరేసుకున్నారు. ఇదే పాఠశాలలో తనతో పాటు చదివిన మిత్రులను కలుసుకుని... వారితో సరదాగా గడిపారు. వైద్యశిబిరంలో పరీక్షల కోసం వచ్చిన వారితో ఆత్మీయంగా మాట్లాడారు. ఓ సాధారణ వ్యక్తిలా అందరిలో కలియదిరగటం విశేషం.
ఇదీ చదవండి: పాములు కనిపిస్తే ఆ యువకుడు పట్టి రక్షిస్తాడు..!