కృష్ణా జలాల విషయంలో సీఎం జగన్ మెతకగా వ్యవహరిస్తున్నారని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కేసీఆర్తో వ్యక్తిగత సంబంధాల కోసం జగన్ రాష్ట్ర ప్రయోజనాలను బలి చేస్తున్నారని ఆరోపించారు.
జగన్ చేతకానితనాన్ని కేసీఆర్ అనుకూలంగా మార్చుకుంటున్నారని అన్నారు. నీటి వాటాల విషయంలో ఒక్క చుక్క నష్టం జరిగినా భాజపా ఊరుకోదని హెచ్చరించారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా గుంటూరులో మొక్కలు నాటారు.