GVL ON MIRCHI YARD : గుంటూరు మార్కెట్ యార్డుని మరోచోట ఏర్పాటు చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు తెలిపారు. మిర్చి యార్డు ప్రాంగణంలో భారత మిర్చి ఎగుమతి వ్యాపారుల సంఘం కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ప్రపంచంలోనే గుంటూరు మిర్చి మార్కెట్ యార్డుకు ప్రత్యేక గుర్తింపు ఉందన్న ఆయన.. గతేడాది 8వేల 500 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని తెలిపారు.
మార్కెట్ యార్డును మరోచోట ఏర్పాటు చేసేందుకు సహకరిస్తా..: జీవీఎల్
GVL ON GUNTUR MIRCHI YARD: ప్రపంచంలోనే గుంటూరు మిర్చి మార్కెట్ యార్డుకు ప్రత్యేక గుర్తింపు ఉందని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు తెలిపారు. గుంటూరు మార్కెట్ యార్డుని మరోచోట ఏర్పాటు చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు.
ఇక్కడి వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు.. రైతులకు మంచి సౌకర్యాలు ఉన్నాయనే భావన తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మార్కెట్ యార్డు.. నగరం పరిధిలో ఉన్నందున ట్రాఫిక్ సమస్యలు లేకుండా మరో చోటుకి మార్చే ప్రతిపాదన ఉందని తెలిపారు. కొత్తగా 250 ఎకరాల్లో గుంటూరు వెలుపల మార్కెట్ యార్డు ఏర్పాటు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని.. అందుకు కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిర్చియార్డు ఛైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, యార్డు అధికారులు, వ్యాపారులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: