గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా బంద్
ప్రత్యేక హోదా కోరుతూ తెదేపా, కాంగ్రెస్, వామపక్షాలు గుంటూరు జిల్లాలో బంద్ చేపట్టారు.
ప్రత్యేక హోదా కోరుతూ గుంటూరులో బంద్
ప్రత్యేకహోదా కోరుతూ చేపట్టిన బంద్ గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. ప్రత్యేక సాధన సమితి ఇచ్చిన పిలుపుతో వామపక్షాలు, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు జిల్లాలో వివిధ చోట్ల పలు రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. గుంటూరు బస్టాండ్ ఎదుట ఉదయం నుంచే సీపీఐ, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. విభజన హామీల పట్ల మోదీ ప్రభుత్వం మొండివైఖరి అవలంభిస్తోందంటూ నినాదాలు చేశారు.
ప్రత్యేక హోదా కోరుతూ గుంటూరులో బంద్