గుంటూరు జిల్లా పిడుగురాళ్ల ప్రాంతంలో ఓ వ్యక్తిపై పలువురు అత్యంత పాశవికంగా దాడి (attack on a person news) చేశారు. పట్టణ శివారులో రోడ్డు డివైడర్‌పై పడేసి కొందరు వ్యక్తులు కాళ్లూ చేతులు పట్టుకోగా..మరో వ్యక్తి కిరాతకంగా బండరాయితో మోదాడు. దెబ్బలు తాళలేక బాధితుడు విలవిల్లాడుతున్నా..ఏ మాత్రం కనికరం లేకుండా చావబాదారు. రాడ్లు, జాకీలతోనూ విచక్షణారహితంగా దాడికి తెగ బడ్డారు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తిని పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువుకు చెందిన సైదాగా గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో 108 వాహనంలో నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఓ వివాహ వేడకకు హాజరై తిరిగి ఇంటికి వస్తుండగా నాపై దాడి చేశారు. మేం మెదటి నుంచి తెదేపాలో పనిచేస్తున్నాం. గతంలో పార్టీల వ్యవహారం, పొలం గట్ల వివాదం మా మధ్య ఉంది. శివారెడ్డి, హేమంత్ రెడ్డి, పున్నారెడ్డి, ప్రతాప్ రెడ్డి, అన్నపురెడ్డి నాపై దాడి చేశారు. వీరితో పాటు నరసరావుపేటకు చెందిన పలువురు వ్యక్తులు దాడిలో పాల్గొన్నారు. - సైదా
కక్షతోనే దాడి..
దాడి ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. అరాచకాలలో ఆంధ్రప్రదేశ్ అప్ఘనిస్థాన్ను మించిపోయిందని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికల్లో తెదేపా ఏజెంట్‌గా పనిచేశారనే కక్షతో సైదాపై దాడికి దిగారని ఆయన మండిపడ్డారు. సైదాపై వైకాపా రౌడీమూకలు నరరూప రాక్షసుల కంటే ఘోరంగా దాడి చేయడం చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అర్థమవుతోందన్నారు.