గుంటూరులో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడికి చెందినగౌతమ్ హీరో షోరూం నుంచి అసెంబ్లీకి చెందిన ఫర్నిచర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. 70 వస్తువులను షోరూంలో గుర్తించామని డీఎస్పీ అన్నారు.అసెంబ్లీ అధికారులు ఇచ్చిన జాబితా కంటే ఎక్కువ ఫర్నిచర్ గుర్తించామన్నారు.అసెంబ్లీ అధికారులు మూడురోజుల క్రితం ఫర్నిచర్‌ను గుర్తించి.. ఫిర్యాదు చేశారన్నారు. వారి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
కోడెల తనయుడి షోరూంలోని అసెంబ్లీ ఫర్నిచర్ స్వాధీనం - మాజీ స్పీకర్ కోడెల
కోడెల కుమారుడి షోరూమ్ నుంచి అసెంబ్లీ ఫర్నిచర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసెంబ్లీ అధికారుల ఫిర్యాదు మేరకు తనిఖీలు చేసి ఫర్నిచర్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అసెంబ్లీ అధికారుల ఫిర్యాదుతోనే...ఆ షోరూంలో తనిఖీలు: డీఎస్పీ
అసెంబ్లీ అధికారుల ఫిర్యాదుతోనే...ఆ షోరూంలో తనిఖీలు: డీఎస్పీ
ఇదీ చూడండి: దాడులపై ఫిర్యాదు చేస్తే.. పట్టించుకోవడం లేదు!
Last Updated : Aug 26, 2019, 11:38 PM IST