ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు.. ఏపీఎస్​ఆర్టీసీ కార్మికుల మద్ధతు - apsrtc workers dharna about tstrc workers

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, గుంటూరులో ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తక్షణమే కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపై తన వైఖరిని మార్చుకోకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్ధతుగా ఏపీఎస్​ఆర్టీసీ కార్మికుల ధర్నా

By

Published : Oct 13, 2019, 9:50 PM IST

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్ధతుగా ఏపీఎస్​ఆర్టీసీ కార్మికుల ధర్నా

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ... ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తన వైఖరిని మార్చుకోవాలని నినాదాలు చేశారు. తెలంగాణలో కార్మికులు సమ్మె చేస్తుంటే అక్కడి ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆర్టీసీ కార్మికుల జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హనుమంతరావు అన్నారు. కేసీఆర్ ఒక్కరే పోరాటం చేస్తే తెలంగాణ రాలేదని... కేవలం కార్మికులు చేసిన పోరాటం ఫలితంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందన్నారు. తక్షణమే కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపై తన వైఖరిని మార్చుకోకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details