APCC President on Sharmila Joins in Congress: ఆంధ్రప్రదేశ్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తూ విడతల వారిగా, అభ్యర్థుల పేర్లను, ఇన్చార్జుల తాలుకా జాబితాను విడుదల చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా సంక్రాంతి పండగ అనంతరం పార్టీలో భారీ మార్పులను చేయనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు వెల్లడించారు.
పార్టీలకు ఎంత సేవ చేసినా తమను పార్టీ పట్టించుకోవడం లేదని పలువురు నేతలు పార్టీలు మారుతున్నారు. అంతేకాకుండా అధికార పార్టీలు అధికారం చేతిలో ఉందనే అహంతో ప్రజా సేవను పక్కన పెట్టి, రాచరికంగా వ్యవహరిస్తున్నాయని మరికొందరు నేతలు పార్టీ మారుతున్న ఘటనలను చూస్తున్నాం. ఈ తరుణంలోనే వైఎస్సార్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది: ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు
షర్మిల కాంగ్రెస్లో చేరడాన్ని స్వాగతిస్తున్నాం:వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిళ కాంగ్రెస్ పార్టీకిలోకి రావడాన్ని తాను స్వాగతిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు.. షర్మిల కాంగ్రెస్ పెద్దల సమక్షంలో పార్టీలో చేరారని గుర్తు చేశారు. ఆమె అవసరం ఎక్కడ ఉంటే అక్కడ హైకమాండ్ బాధ్యతలు అప్పగిస్తుందని ఆయన ప్రకటించారు.
సంక్రాంతి తర్వాత ఏపీసీసీ పెనుమార్పులు:సంక్రాంతి తర్వాత కాంగ్రెస్లో పెనుమార్పులు సంభవించనున్నాయని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు వెల్లడించారు. ఈ నెల 17వ తేదీన స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మధుసూదన్ రాష్ట్రానికి రానున్నారని వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియను, అభ్యర్థుల ఎంపిక కసరత్తును ఆయన ప్రారంభించనున్నారని ప్రకటించారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి - ఏపీలోనూ వైసీపీ పని అంతేనంటున్న ప్రతిపక్షాలు
ఏపీసీసీ పొత్తులపై గిడుగు వివరణ: రాష్ట్రంలో కలిసి వచ్చే పార్టీలతోనే కాంగ్రెస్ వెళ్తుందని ఏపీసీసీ అధ్యక్షులు వెల్లడించారు. సీపీఐ, సీపీఎం, ఆమ్ఆద్మీ పార్టీలతో పొత్తులపై మాట్లాడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఆ పార్టీలతో పొత్తులపై చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. కాంగ్రెస్లో షర్మిల చేరికపై హర్ష కుమార్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని స్పష్టం చేశారు. సమాజంలోని అందరికీ న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీనే అని వివరించారు. బీజేపీ రాజకీయ లబ్ధి కోసం రామమందిర నిర్మాణాన్ని వాడుకోవాలని చూస్తోందని ఆయన అన్నారు.
అసలు హర్ష కుమార్ వ్యాఖ్యలెంటీ:ఇంతకాలం తెలంగాణలో రాజకీయాల్లో ఉన్న షర్మిలను తీసుకువచ్చి, ఆంధ్ర రాజకీయాల్లో కీలక పదవులు అప్పగించవద్దని మాజీ ఎంపీ హర్ష కుమార్ అన్న విషయం తెలిసిందే. తెలంగాణ బిడ్డను అని చెప్పుకున్న షర్మిలను తీసుకువచ్చి నాయకత్వ భాద్యతలు అప్పగిస్తే, నాయకత్వం బూడిదలో పోసిన పన్నీరులా మారుతోందని అన్నారు. ఒక రాష్టంలో చెల్లని నాణెం మరో రాష్ట్రంలో ఎలా చెల్లుతుంది అంటూ ఘాటూ వ్యాఖ్యలు చేశారు.
సీఎం జగన్, భారతిలను సీబీఐ విచారించాలి: తులసి రెడ్డి