- రేపు దిల్లీ వెళ్లనున్న సీఎం జగన్.. ఆ అంశాలపై ప్రధానితో చర్చ!
CM JAGAN DELHI TOUR : సీఎం జగన్ మరోమారు దేశ రాజధాని దిల్లీ వెళ్లనున్నారు. పోలవరం పెండింగ్ నిధులు విడుదల చేయాలని ప్రధాని మోదీని కోరునున్నట్లు సమాచారం.
- రంగా ఆశయాలు ముందుకు తీసుకెళ్లడంలో రాజీ ప్రసక్తే లేదు: కొల్లు రవీంద్ర
KOLLU RAVINDRA : మచిలీపట్నంలో టీడీపీ నేత కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా గుడివాడ బయలుదేరిన ఆయనను మధ్యలోనే అడ్డగించారు.
- పండగ సరుకుల పేరుతో మోసం.. రూ.4 కోట్లతో వాలంటీర్ ఉడాయింపు
Volunteer Fraud: సంక్రాంతి పండగకు సరుకులు ఇప్పిస్తానని చీటీలు కట్టించిన వాలంటీర్ మోసానికి పాల్పడింది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు నాలుగు కోట్ల రూపాయల వరకు వసూలు చేసి బాధితులకు కుచ్చు టోపి పెట్టింది. విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనలో.. మోసపోయామని తెలుసుకున్న బాధితులు ఆందోళనకు గురవుతున్నారు.
- విజయవాడలో అర్ధరాత్రి దొంగల హల్చల్.. ఆ గ్యాంగేనా..!
Theft attempt: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్ సింగ్ నగర్లో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. రైల్వేట్రాక్ సమీపంలోని ఓ ఇంటి తలుపులను నిక్కర్లతో వచ్చిన ముగ్గురు దుండగులు పగులగొడుతుండగా స్థానికులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
- జైలు నుంచి సిద్ధూ ముందస్తు విడుదల.. మోదీ సర్కార్ రూల్‌తో...
34 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘర్షణ కేసులో జైలుకు వెళ్లిన పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ జనవరి 26న విడుదల కానున్నారు. జైలు నుంచి విడుదలయ్యాక ఆయనకు ఘన స్వాగతం పలకనున్నట్లు కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు.
- నలుగురు విదేశీయులకు కరోనా.. అందరూ ఆ ప్రోగ్రామ్‌కు వచ్చినవారే!
బిహార్‌కు చేరుకున్న నలుగురు విదేశీయులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్యశాఖ అప్రమత్తమై.. అందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
- తైవాన్‌పై చైనా దూకుడు.. 71 యుద్ధ విమానాలను పంపిన డ్రాగన్
తైవాన్‌కు అమెరికా మద్దతుగా నిలిస్తున్నందున చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. చైనా తమ గగన తలంలోకి 71 యుద్ధ విమానాలను పంపిందని తైవాన్ ఆరోపించింది.
- 40 కోట్ల ట్విట్టర్ యూజర్ల డేటా చోరీ.. సుందర్ పిచాయ్, డబ్ల్యూహెచ్ఓ సహా..
ట్విట్టర్‌కు సంబంధించిన 40 కోట్ల మంది వినియోగదారుల డేటాను చోరీ చేసినట్లు హ్యాకర్ తెలిపాడు. ట్విట్టర్ తన నుంచి ఈ డేటాను కొనుకోలు చేయవచ్చని చెప్పాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెలీ సైబర్ సంస్థ హడ్సన్ రాక్ వెల్లడించింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, డబ్ల్యూహెచ్‌వో, కేంద్ర సమాచారం మంత్రిత్వ శాఖ ట్విట్టర్ డేటా చోరీకి గురైనట్లు పేర్కొంది. మరోవైపు ట్విట్టర్ సీఈఓగా బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నానని ఇండో అమెరికన్ వీ.ఏ అయ్యాదురై తెలిపారు.
- శ్రీలంకతో సిరీస్.. రోహిత్-రాహుల్ ఔట్.. కేవలం టీ20కే కాదట వన్డే కూడా..
శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌లకు కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ దూరం కానున్నట్లు రెండు మూడు రోజుల నుంచి జోరుగా ప్రచారం సాగుతోంది. బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో రోహిత్ వేలికి గాయమైన సంగతి తెలిసిందే. ఇంకా గాయం నుంచి అతడు కోలుకోని కారణంగా ఇప్పుట్లో మ్యాచ్‌లు ఆడే పరిస్థితి లేదని అంటున్నారు.
- అక్కినేని ఫ్యామిలీలో అడివి శేష్ ఎందుకున్నాడబ్బా.. లింక్ ఏంది?
టాలీవుడ్ సెలబ్రిటీలంతా తమ కుటుంబాలతో కలిసి క్రిస్మస్ వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే హీరో అడివి శేష్ మాత్రం.. అక్కినేని ఫ్యామిలీతో కలిసి చేసుకున్నాడు. దీంతో అభిమానుల్లో పలు అనుమానాలు మెదులుతున్నాయి.