- ప్రభుత్వం చేసిన మంచిని గడప గడపకూ తీసుకెళ్లాలి: సీఎం జగన్
CM Jagan at Jayaho BC program in Vijayawada: రాబోయే ఎన్నికల్లో..ప్రజలు వైసీపీ వైపే మొగ్గు చూపి.. విజయాన్ని చేకూర్చుతారని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం బీసీలను ఉద్దేశించి మాట్లాడారు.
- చెత్త వాహనాలనూ వదలడం లేదంటూ.. ఎమ్మెల్యేపై ఫైర్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి
Municipal Chairman JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి నిరసనకు దిగారు. మరమ్మతులకు గురైన పారిశుద్ధ్య వాహనాలతో ర్యాలీతో పాటు భిక్షాటన చేయడానికి ఆయన సిద్ధమయ్యారు. తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు, మీడియాతో కలిసి పాడైపోయిన వాహనాల వద్దకు వెళ్లిన ఆయన ఎమ్మెల్యే పెద్దారెడ్డి సొంత ట్రాక్టర్లు అద్దెకు పెట్టారని ఆరోపించారు..
- వైసీపీ జయహో సభ ట్రాఫిక్ మళ్లీంపు.. ట్యాంకర్ డ్రైవర్‌పై దాడి
Police Attack On Tanker Driver విజయవాడలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైసీపీ జయహో సభకు ట్రాఫిక్ మళ్లీస్తున్న సమయంలో.. ట్యాంకర్ డ్రైవర్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో అతనికి స్వల్పగాయాలయ్యాయి.
- కోర్టులో సాక్ష్యం చెప్పాడన్న కోపంతో.. టీడీపీ కార్యకర్తపై వైసీపీ నేత దాడి
Land Dispute In Srikakulam: భూ వివాదంలో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడన్న కారణంతో.. టీడీపీ కార్యకర్తపై వైసీపీ నాయకుడు దాడి చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. గాయపడిన బాధితుడుని స్థానికులు 108 వాహనంలో పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
- విశాఖ: దువ్వాడ స్టేషన్లో రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కున్న విద్యార్థిని
విశాఖ దువ్వాడ రైల్వేస్టేషన్లో ఓ విద్యార్థిని రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయింది. అన్నవరం నుంచి దువ్వాడ వచ్చి రైలు దిగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు గంటన్నరపాటు యవతి రైలు, ఫ్లాట్‌ఫామ్ మధ్యనే తీవ్రంగా బాధపడ్డారు. చివరికి గంటన్నరపాటు శ్రమించిన రైల్వే సిబ్బంది... యువతిని బయటకు తీశారు
- ఏడాది క్రితం రూ.35వేలు అప్పు.. వడ్డీతో కలిపి రూ.4.5లక్షలు డిమాండ్.. భయంతో ఉరేసుకుని..
ఓ యువకుడు సంవత్సరం క్రితం ఓ వ్యక్తి నుంచి రూ.35 వేలు అప్పుగా తీసుకున్నాడు. వడ్డీల బాదుడుతో ఆ బకాయి మొత్తం రూ.నాలుగున్నర లక్షలు అయిందంటూ అప్పు ఇచ్చిన వ్యక్తి అతడిపై ఒత్తిడి తెచ్చాడు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువకుడు మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ ఘటన రాజస్థాన్‌లో జరిగింది.
- గుండెనిండా దుఃఖం.. ప్లాస్టిక్ సంచిలో భార్య మృతదేహం.. అంత్యక్రియలకు డబ్బులు లేక నడుచుకుంటూ..
కర్ణాటకలోని యలందూరు పట్టణంలో ఓ హృదయ విదారక ఘటన జరిగింది. అంత్యక్రియలకు డబ్బులు లేవని ఓ వ్యక్తి తన భార్య మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో పెట్టి సమీప నదికి తీసుకువెళ్లాడు.
- ట్విట్టర్ ఫైల్స్ రేపిన మంట.. మరో కీలక ఉద్యోగిపై మస్క్ వేటు
హంటర్ బైడెన్ ల్యాప్‌టాప్‌పై 2020లో న్యూయార్క్ పోస్టు ప్రచురించిన కథనం ట్విట్టర్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
- వన్డే ర్యాంకింగ్స్‌లో మెరుగుపడ్డ శ్రేయస్, రాహుల్.. కోహ్లీ స్థానం ఎంతంటే?
బుధవారం విడుదలైన ఐసీసీ పురుషుల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్లు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. అయితే రోహిత్, కోహ్లీ ఏ స్థానాల్లో ఉన్నారంటే?
- నయన్ నుంచి హన్సిక వరకు 2022లో పెళ్లి చేసుకున్న దక్షిణాది సెలబ్రెటీలు వీరే
2022లో దక్షిణాది పలువురు సెలబ్రెటీలు తమ జీవిత భాగస్వాములతో ఏడడుగులు వేశారు. తాము ప్రేమించిన వ్యక్తులతో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఇష్టమైన వ్యక్తిని మనువాడితే ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేమంటున్నారు.
ఏపీ ప్రధాన వార్తలు