కరోనా సహాయచర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ఇవ్వాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. 'చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఆంధ్రప్రదేశ్' పేరుతో చెక్కులను ఇవ్వాలని విన్నవించింది. ఆన్‌లైన్ ద్వారా ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకుకు విరాళాలు పంపవచ్చని తెలిపింది. ఎస్‌బీఐ (వెలగపూడి శాఖ) ఖాతా నెం.38588079208, ఎస్‌బీఐ (వెలగపూడి సచివాలయ శాఖ) ఐఎఫ్ఎస్సీ కోడ్ SBIN0018884, ఆంధ్రాబ్యాంకు (వెలగపూడి శాఖ) ఖాతా నెం.110310100029039, ఆంధ్రాబ్యాంకు (వెలగపూడి సచివాలయ శాఖ) ఐఎఫ్ఎస్సీ కోడ్ ANDB0003079 కు విరాళాలు ఇవ్వాలని కోరింది. apcmrf.ap.gov.in ద్వారా విరాళాలు పంపవచ్చని ప్రభుత్వం పేర్కొంది. నెట్‌బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా విరాళాలు ఇవ్వొచ్చని తెలిపింది.
కరోనా సహాయ చర్యలకు విరాళాలు ఇవ్వండి: ప్రభుత్వం
రోజు రోజుకి రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కరోనా సహాయ చర్యల్లో భాగంగా తమవంతు సహాయం అందించాలని కోరుతూ బ్యాంకులో జమ చేసేందుకు ఖాతా వివరాలను పేర్కొంది.
cm founds