ఆక్రమణల ఆరోపణలపై.. వైకాపా నేతల పరిశీలన - gunturu district
ఆక్రమణల ఆరోపణలు రావడంపై.. వైకాపా నేతలు లంక గ్రామాల్లో పర్యటించారు. అధికార పార్టీ నేతల తీరును తప్పుబట్టారు.
ఆక్రమణలో ఆరోపణలపై.. వైకాపా నేతల పరిశీలన
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని లంక గ్రామాల్లో సోమవారం వైకాపా ప్రజా ప్రతినిధుల బృందం పర్యటించింది. నదిలో కృష్ణా జిల్లా గుంటుపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆక్రమణలు చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై సంబంధిత ప్రాంతాలను పరిశీలించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.