పట్టాలు ఇస్తామన్నారు.. ఖాళీ చేయించారు - gunturu
గుడిసెలు, ఖాళీ స్థలాల కోసం గుంటూరు శివారులో బాధితులు ఆందోళనకు దిగారు. తమను ఖాళీ చేయించిన చోటే స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
protest
గుంటూరు శివారు ఓబులునాయుడుపల్లెలో గుడిసెల తొలగింపుపై బాధితులు ఆందోళన చేశారు. ఆ స్థలాన్ని తమలాంటి పేదలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. ప్రభుత్వ పోరంబోకు స్థలానికి సంబంధించిన పట్టాలు ఇవ్వాలని ఆరేళ్లుగా పోరాడుతున్నామన్నారు. గుడిసెలు వేసుకున్న తమకు పట్టాలు ఇస్తామని చెప్పి ఖాళీ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. వేరే వ్యక్తులు ఆ స్థలాన్ని ఆక్రమించారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.