Construction of churches: రాష్ట్రవ్యాప్తంగా చర్చిల నిర్మాణం, మరమ్మతులు, ఇతర పనులకు ప్రభుత్వం 175 కోట్ల రూపాయలు అందించనుంది. నియోజకవర్గానికి కోటి రూపాయల చొప్పున కేటాయించనున్నట్లు సమాచారం. కొత్త చర్చిల నిర్మాణం, పాతవాటి పునర్నిర్మాణం, మరమ్మతులు, చర్చి నిర్వహించే సంస్థలు, శ్మశాన వాటికల ఆధునికీకరణకు ఈ నిధులు వెచ్చించాలని తెలిసింది. జిల్లా కేంద్రాల్లో అదనంగా మరో కోటి రూపాయల విలువైన పనులు చేపట్టేందుకు అనుమతి ఉన్నట్లు సమాచారం.
రాష్ట్రంలో చర్చిలకు మహర్దశ.. 175 నియోజకవర్గాలకు ఎన్ని కోట్లంటే??
Construction of churches: రాష్ట్రవ్యాప్తంగా చర్చిల నిర్మాణం, మరమ్మతులు, ఇతర పనులకు అధికార ప్రభుత్వం పచ్చజెండా ఊపనున్నట్లు కనిపిస్తోెంది. 175 నియోజకవర్గాలకు నిధులను అందించనున్నట్లు సమాచారం..
చర్చిల నిర్మాణం
ఈ నిధుల్ని గ్రాంటు ఇన్ ఎయిడ్ విధానంలో అందించనుంది. ఈ మేరకు ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు స్వీకరించాలని రాష్ట్ర క్రైస్తవ ఆర్థిక సంస్థ ఈ నెల 7వ తేదీన ఉత్తర్వులు జారీచేసింది. ఆ ప్రకారం కలెక్టర్లు.. జిల్లాల్లో ప్రతిపాదనల స్వీకరణకు ఆదేశాలు ఇస్తున్నారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక చర్చిల నిర్మాణం, మరమ్మతులు, ఇతర పనులకు భారీగానే దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 200 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
ఇవీ చదవండి: