రాష్ట్రంలోని పేదలందరికీ తక్షణసాయం అందించకపోతే ఆఫ్రికాలోని సోమాలియాలా ఆకలి చావులు చూడాల్సి వస్తుందేమోనని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నపూర్ణ అని పేరున్న ఆంధ్రప్రదేశ్తో ఆకలి కేకలు పెట్టిస్తున్నారని విమర్శించారు. ప్రజలు కడుపు నింపుకోవడానికి పాట్లు పడటం ప్రభుత్వం చేతగాని తనానికి నిదర్శనమని అన్నారు. పేదల ఆకలి కేకలు వైకాపా ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. రైతులు, అసంఘటిత రంగ కార్మికులు, వలస కూలీల జీవితాలు మరింత దయనీయంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు.
'అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్తో ఆకలి కేకలు పెట్టిస్తున్నారు' - ap lockdown news today
పేదల ఆకలి తీర్చేందుకు వైకాపా ప్రభుత్వం ఏ ఒక్క ప్రయత్నం చేయడం లేదని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. లాక్డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు, అసంఘటిత రంగాల కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు.
అనగాని సత్యప్రసాద్