ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మా ఉద్యోగాలు ఆ మహాత్ముడి భిక్ష: హోం మంత్రి

By

Published : Dec 6, 2019, 1:34 PM IST

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్​ అంబేడ్కర్​ 63వ వర్ధంతిని పురస్కరించుకుని హోం మంత్రి మేకతోటి సుచరిత గుంటూరులో ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. తమ ఉద్యోగాల కల్పనలో ఆ మహాత్ముడి పాత్ర ఎంతో ఉందని..ఇది ఆయన పెట్టిన భిక్షని గుర్తు చేసుకున్నారు.

Ambedkar Death anniversary celebrations at guntur by home minister mekathoti sucharitha
గుంటూరులో అంబేడ్కర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పిస్తున్న నేతలు

గుంటూరులో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న నేతలు

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్​ అంబేడ్కర్​ 63వ వర్ధంతి కార్యక్రమం గుంటూరులో జరిగింది. అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేడ్కర్​ చేసిన సేవలను హోంమంత్రి గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరు అయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. అంబేడ్కర్​ అడుగుజాడల్లో నడిచి ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆకాంక్షించారు. దిశ హత్యకేసులో పోలీసులు వ్యవహరించిన తీరును స్వాగతిస్తున్నామని హోంమంత్రి అన్నారు.

రాజకీయ ప్రముఖుల నివాళి

తెదేపా నేతలు నక్కా ఆనందబాబు,డొక్కా మాణిక్యవరప్రసాద్, జీవీ ఆంజనేయులు, మద్దాలి గిరిధర్, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ, పలువురు నేతలు అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దిశ హత్యకేసులో నిందితుల ఎన్​కౌంటర్​పై స్పందించిన నేతలు దిశకు అసలైన న్యాయం జరిగిందని అన్నారు. ఇలాంటి కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడినప్పుడే మృగాళ్లు భయపడతారని అన్నారు.

ఇదీ చదవండీ:

మంగళగిరిలో తెదేపా కేంద్ర కార్యాలయం ప్రారంభం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details