గుంటూరు జిల్లా అమరావతి తహసీల్దార్ ఎ. శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ ఈఓ కోయ శ్రీనివాసరావు సస్పెండ్‌కు గురయ్యారు. ఈ మేరకు కలెక్టర్ వివేక్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 15న అమరావతి మండలంలోని ధరణికోట ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించడంలో నిర్లక్ష్యం వహించారంటూ... తెదేపా వార్డు సభ్యులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వీరిరువురు ఉద్దేశపూర్వకంగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన ఈసీ.. విచారణ జరపాలని కలెక్టర్ వివేక్ యాదవ్‌ను ఆదేశించింది. విచారణ జరిపిన కలెక్టర్.. ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు.
అమరావతి తహసీల్దార్, పంచాయతీరాజ్ ఈవో సస్పెన్షన్ - అమరావతి పంచాయతీ రాజ్ ఈవో
గుంటూరు జిల్లా అమరావతి తహసీల్దార్, పంచాయతీరాజ్ ఈవో సస్పెండ్ అయ్యారు. ధరణికోట ఉపసర్పంచ్ ఎన్నికల్లో నిర్లక్ష్యం వహించారంటూ.. కలెక్టర్ వివేక్ యాదవ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి తహసీల్దార్, పంచాయతీరాజ్ ఈవో సస్పెన్షన్