రాజధాని రైతుల ఆందోళనలు 97వ రోజుకు చేరుకున్నాయి. కరోనా నేపథ్యంలో కృష్ణాయపాలెం, వెలగపూడి దీక్షశిబిరాలలో కొద్దిమంది మాత్రమే నిరసనలు చేస్తున్నారు. కోవిడ్-19 కట్టడికి ముందు జాగ్రత్తలను పాటిస్తూ రైతులు దీక్షలను కొనసాగిస్తున్నారు. చిన్నారులు ఉద్యమంలో పాలుపంచుకున్నారు. మూడు రాజధానులు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. ఎన్ని విపత్తులు వచ్చినా ఉద్యమం మాత్రం ఆగదని వారు తెలిపారు.
కరోనా జాగ్రత్తలు పాటిస్తూ అమరావతి రైతుల ధర్నా - వెలగపూడిలో రైతుల ధర్నా
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో రాజధాని రైతులు ముందస్తు జాగ్రత్తలతో శిబిరాలలో కొద్దిమందే నిరసనలు కొనసాగిస్తున్నారు. కృష్ణాయపాలెం, వెలగపూడి దీక్షశిబిరాలలో ఒకరికొకరు దూరంగా ఉంటూ 97వరోజు ధర్నా చేపట్టారు. మిగిలిన రైతులు వారి ఇంటి వద్దనుంచే ఆందోళనలు చేస్తున్నారు.
కరోనా జాగ్రత్తలు పాటిస్తూ అమరావతి రైతుల ధర్నా