ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'రాజధానిని రక్షించుకుంటాం.. విశాఖ ఉక్కునూ కాపాడుకుంటాం'

By

Published : Feb 10, 2021, 3:43 PM IST

అమరావతిలో రైతులు, మహిళల ఆందోళనలు 421వ రోజుకు చేరాయి. రాజధానిని రక్షించుకుంటాం.. విశాఖలో ఉక్కు కర్మాగారాన్నీ కాపాడుకుంటాం అంటూ రైతులు, మహిళలు నినాదాలు చేశారు.

amaravathi protest reached to 421 day
అమరావతి నిరసన

అమరావతి నిరసన

రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలంటూ.. రైతులు 421వ రోజు ఆందోళనలు కొనసాగించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఎర్రబాలెం, అనంతవరం, దొండపాడు, పెదపరిమి, నెక్కల్లు, పెనుమాకలో రైతులు, మహిళలు నిరసన దీక్షలు చేశారు. తుళ్లూరు, మందడం, అనంతవరంలో విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించవద్దంటూ మూడోరోజు నిరాహార దీక్షలు చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన విభిన్న ప్రతిభావంతుల ఐకాస నాయకులు మందడంలో ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ అధికారంలో వచ్చిన నాటి నుంచి అన్ని కూల్చివేతలేనని ఐకాస నేతలు ఆగ్రహించారు. ఒక్క పరిశ్రమనైనా తీసుకరాలేని సీఎం.. ఇపుడు ఉన్న ఏకైక అతి పెద్ద పరిశ్రమను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రానికి పరోక్ష మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details