ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతి కోసం.. కాలినడకన తిరుపతికి! - amaravathi top news

అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ.. మోతడక రైతులు చేపట్టిన తిరుపతి పాదయాత్ర బొప్పూడికి చేరుకుంది. బొప్పూడి రైతులు మోతడక అన్నదాతలకు సంఘీభావం తెలిపారు.

amaravathi
అమరావతి

By

Published : Mar 3, 2021, 7:13 AM IST

అమరావతి ప్రాంతం మోతడక నుంచి తిరుపతికి.. కాలి నడకన వెళ్తున్న రైతులు గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడికి చేరుకున్నారు. అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ.. తిరుపతికి పాదయాత్ర చేస్తున్నారు.

చిలకలూరిపేట అమరావతి పరిరక్షణ సమితి ఐకాసకు చెందిన రైతులు... మోతడక రైతులకు సంఘీభావం తెలిపారు. మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా నినాదాలు చేసి... అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details