వ్యవసాయరంగ ఆధునికీకరణ, అభివృద్ధికి ప్రభుత్వం పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. దేశంలో 11 ప్రఖ్యాత సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 11 వేల 158 రైతు భరోసా కేంద్రాలకు తగిన సాంకేతిక విజ్ఞానాన్ని ఆ సంస్థలు అందిస్తాయన్నారు. రైతులు, వ్యవసాయశాఖ అధికారుల నైపుణ్యాభివృద్ధికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గం, జిల్లా కేంద్రాల్లో వ్యవసాయ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు.
'వ్యవసాయ రంగ అభివృద్ధే మా ప్రభుత్వ ధ్యేయం'
వ్యవసాయ విస్తరణ, ఉత్పత్తుల్లో నాణ్యత తీసుకురావాలని తమను సీఎం ఆదేశించినట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. రైతులు, వ్యవసాయశాఖ అధికారుల నైపుణ్యాభివృద్ధికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
మాట్లాడుతున్న మంత్రి కన్నబాబు