తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ... గుంటూరులో అగ్రిగోల్డ్ బాధితులు నిరసన చేశారు. హోం మంత్రి సుచరితను కలిసేందుకు వెళ్లిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. అధికారం చేపట్టిన వారం రోజుల్లోనే అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని.. ఆత్మహత్యకు, అసహజ మరణానికి పాల్పడ్డ వారికి రూ.10 లక్షలు పరిహారం చెల్లిస్తామన్న ముఖ్యమంత్రి హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 22 నుంచి 31 వరకు విజయవాడలో నిరసన కార్యక్రమాలు చేపడతామని అగ్రిగోల్డ్ బాధితులు హెచ్చరించారు. అనంతరం హోం మంత్రిని కలిసేందుకు ఇద్దరిని మాత్రమే పోలీసులు అనుమతించారు.