ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగులపై చర్యలు

ఎన్నికల విధులకు గైర్హాజరయ్యే పోలింగ్ సిబ్బందిపై.. చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ గిరిజా శంకర్ సంయుక్త కలెక్టర్లను ఆదేశించారు. వెబ్‌ కాస్టింగ్‌ సేవలు అందిస్తున్న విద్యార్థులకు రోజుకు రూ.500చొప్పున చెల్లించాలని చెప్పారు.

Actions against employees who are absent from duties
విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగులపై చర్యలు

By

Published : Feb 13, 2021, 9:31 AM IST

గుంటూరు జిల్లాలో ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికల విధులకు గైర్హాజరయ్యే పోలింగ్‌ సిబ్బందిపై తక్షణం చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ సంయుక్త కలెక్టర్లను ఆదేశించారు. రెండోదశ పోలింగ్‌ ఏర్పాట్లపై 13 జిల్లాల జేసీలు, జడ్పీ సీఈవోలు, డీపీవోలతో ఆయన శుక్రవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘గైర్హాజరైన వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలి. రెండుకు మించి డ్యూటీలు ఏ ఉద్యోగికీ వేయవద్దు. ఎన్నికల ఖర్చులకు రెండో విడతగా శుక్రవారం మరో రూ.116 కోట్లు విడుదల చేశాం. తొలిదశ ఓట్ల లెక్కింపు సమయంలో తలెత్తిన సమస్యలను పరిగణనలోకి తీసుకుని 5వేల కన్నా ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో ఓట్లు లెక్కించేందుకు అదనంగా ఒక అధికారిని, పెద్ద పంచాయతీల్లో, సమస్యాత్మక ప్రాంతాల్లో రిటర్నింగు అధికారికి సహాయంగా తహసీల్దార్‌, ఎంపీడీవో, ఈవో పీఆర్‌డీలను నియమించాలి’ అని ఆయన ఆదేశించారు. వెబ్‌ కాస్టింగ్‌ సేవలు అందిస్తున్న విద్యార్థులకు రోజుకు రూ.500చొప్పున చెల్లించాలని చెప్పారు.

ఇదీ చదవండి: పంచాయతీ పోరు: కాసేపట్లో ప్రారంభంకానున్న రెండోదశ పోలింగ్

ABOUT THE AUTHOR

...view details