Guntur Municipal Corporation: అవినీతికి పాల్పడిన గుంటూరు నగరపాలక సంస్థ అకౌంటెంట్ సిరిల్ పాల్‌ను కమిషనర్ చేకూరి కీర్తి సస్పెండ్ చేశారు. గుత్తేదారులకు చెల్లించాల్సిన బిల్లులను తెలివిగా అకౌంటెంట్ సిరిల్ పాల్ తన సొంత ఖాతాల్లోకి మళ్ళించుకున్నట్లు అంతర్గత విచారణలో తేలింది. దీంతో సిరిల్ పాల్‌ను సస్పెండ్ చేసిన కమిషనర్.. సమగ్ర విచారణకు ఆదేశించారు. నగరపాలక సంస్థ గుత్తేదారులకు బిల్లులు చెల్లించాల్సి వచ్చినప్పుడు ఐదారు మందికి కలిపి ఒకే చెక్ మంజూరు చేస్తారు. ఆ మొత్తంలో ఏ గుత్తేదారుకు ఎంత చెల్లించాలో నోట్ రాస్తారు. సిరిల్ పాల్ తన అకౌంట్‌ను కూడా అందులో చేర్చి డబ్బులు మళ్లించుకున్నాడు. బిల్లులు అందని గుత్తేదారు ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది.
అవినీతికి పాల్పడిన అకౌంటెంట్ ను సస్పెండ్ చేసిన గుంటూరు కమిషనర్
Guntur Municipal Corporation: అవినీతికి పాల్పడిన గుంటూరు నగరపాలక సంస్థ అకౌంటెంట్ సిరిల్ పాల్‌ను కమిషనర్ చేకూరి కీర్తి సస్పెండ్ చేశారు. గుత్తేదారులకు చెల్లించాల్సిన బిల్లులను తెలివిగా అకౌంటెంట్ సిరిల్ పాల్ తన సొంత ఖాతాల్లోకి మళ్ళించుకుని.. మొత్తం రూ.47 లక్షల రూపాయల అవినీతికి పాల్పడినట్లు తెలిపారు. బిల్లులు అందని గుత్తేదారు ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది.
గుంటూరు నగరపాలక సంస్థ
సిరిల్ పాల్ మొత్తం రూ.47 లక్షల రూపాయల అవినీతికి పాల్పడినట్లు ప్రాధమిక విచారణలో నిర్ధారణ అయింది. సమగ్ర విచారణ జరిపితే ఇంకా ఎంత మేరకు అవినీతి చేశారనేది బయటపడే అవకాశముంది. ఈ వ్యవహారంలో సైబర్ క్రైమ్ కోణంలో విచారణ జరపాలని అర్బన్ ఎస్.పికీ కమిషనర్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు. అలాగే అకౌంట్స్ వివరాల విచారణకు స్టేట్ ఆడిట్ డైరెక్టర్‌కు బాధితులు లేఖ రాశారు.
ఇవీ చదవండి: