గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనధికారికంగా ఉన్న 56 వేల 700 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఐదుగురు స్టాంప్ వెండర్స్ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో అధిక వసూళ్లకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు తాము తనిఖీలు నిర్వహించినట్లు ఏసీబీ ఏఎస్పీ సురేష్ బాబు తెలిపారు. దీనిపై కార్యాలయ సిబ్బందిని విచారిస్తున్నామని తెలిపారు.
పిడుగురాళ్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
పిడుగురాళ్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధిక వసూళ్లకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు