ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు... ఇద్దరిని అదుపులోకి తీసుకున్న అధికారులు - ఏసీబీ దాడుల వార్తలు

గుంటూరు జిల్లా కాకుమాను తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. వారికి అందిన ఫిర్యాదు మేరకు రెక్కీ నిర్వహించి, అవినీతికి పాల్పడిన వారిని పట్టుకున్నామని తెలిపారు.

ACB raids
ACB raids

By

Published : Jun 28, 2021, 10:45 PM IST

గుంటూరు జిల్లా కాకుమాను తహసీల్దార్ కార్యాలయంలో దాడులు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. చినలింగాయపాలెం గ్రామానికి చెందిన మోదుకూరి వెంకటరత్నం ఈ నెల 26వ తేదీన జిల్లాలోని ఏసీబీ కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెక్కీ నిర్వహించామన్నారు.

అధికారుల వివరాల ప్రకారం....

రైతు వెంకటరత్నం.. తనకున్న 93 సెంట్ల పొలాన్ని మ్యుటేషన్ చేయించాలని, పట్టాదారు పాసు పుస్తకం కోసం దరఖాస్తు చేసినట్లు చెప్పారు. ఇందుకు గాను వీఆర్వో ఆకుల నరసింహారావు, ఆర్​ఐ చంద్రశేఖర్​లు రూ.10 వేలు డిమాండ్​ చేశారని తెలిపాడు. చివరగా రూ.8వేలు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఏసీబీకి రైతు ఫిర్యాదు చేశాడు. తహసీల్దార్​ కార్యాలయంలో ఎనిమిది వేలు నగదు వీఆర్వోకి ఇస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నాం.

అవినీతికి పాల్పడిన వీఆర్వో, ఆర్​ఐపై కేసు నమోదు చేశామని ఏసీబీ డీఎస్పీ ప్రతాప్​ కుమార్​ తెలిపారు. వారిని గుంటూరు ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. ఫోన్​ ద్వారా లేదా కార్యాలయానికి వచ్చి గానీ తమ సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని ఆయన చెప్పారు. ఆదివారం కూడా కార్యాలయం తెరిచే ఉంటుందని... తమ సేవలు ఉపయోగించుకోవాలని ప్రజలను కోరారు.

ఇదీ చదవండి:జీవో 64ను వెనక్కి తీసుకోవాలి: ప్రభుత్వ వైద్యుల సంఘం

ABOUT THE AUTHOR

...view details