ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"ఒక్కరోజులో 5 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం"

గుంటూరులో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమానికి కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ హాజరయ్యారు. మొక్కల సంరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని సూచించారు.

By

Published : Aug 17, 2019, 12:28 PM IST

గుంటూరు

గుంటూరులో వనమహోత్సవం

వన సంరక్షణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలని గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ పిలుపునిచ్చారు. 70వ వన మహోత్సవంలో భాగంగా ఆయన.. గుంటూరులోని ఎన్జీవో కాలనీ సమీపంలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఒకేరోజు జిల్లావ్యాప్తంగా 5 లక్షలు మొక్కలు నాటిస్తున్నామని.. వారం రోజుల్లో 7లక్షల 45వేలు మొక్కలు నాటనున్నామని చెప్పారు. వన సంరక్షణ ఉద్యమంలో ప్రజలు, పారిశ్రామికవర్గాలు, స్వచ్ఛంద సంస్థలు తమ వంతు పాత్ర పోషించాలని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details