కడుపు నొప్పి తాళలేక ఓ యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండలంలో జరిగింది. సి.రంగిపాలేనికి చెందిన అఖిల్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కొద్దిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. శనివారం కూడా నొప్పి రావడంతో తట్టుకోలేక... ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందాడు.
పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య - teenager sucide with drinking insecticide at guntur
కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ యువకుడు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కడుపునొప్పి తట్టుకోలేక పురుగుల మందు తాగి యువకుడు మృతి