గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి వీరయ్య స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన పోలీసులు అతన్ని పల్నాడు ఆసుపత్రికి తరలించారు. భార్య తనపై కేసు పెట్టడం వల్లే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
భార్య కేసు పెట్టిందని భర్త ఆత్మహత్యాయత్నం
భార్య తనపై కేసు పెట్టిందని ఓ భర్త పెట్రోలు పోసుకుని పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డిన ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో వెలుగు చూసింది. బాధితుడిని చికిత్స నిమిత్తం పల్నాడు ఆసుపత్రికి తరలించారు.
భర్త ఆత్మహత్యాయత్నం