గుంటూరు శ్రీనగర్లో ఓ వ్యక్తి ఆన్లైన్లో వస్తువులు అమ్మకానికి పెట్టి ఓ వ్యక్తి మోసం చేశాడు. నగరానికి చెందిన స్వాతి తన భర్త తక్కువ ధరకే కంపెనీ ఫర్నిచర్ అని ఓఎల్ఎక్స్ పోస్ట్ చూశారు. అమ్మకానికి వస్తువులు పెట్టిన వ్యక్తి.. ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాను అంటూ నమ్మించి వారి దగ్గరినుంచి డబ్బులను తన ఖాతాలో వేయమన్నాడు. తక్కువ ధరకే ఏసీ, ఫ్రిజ్ వస్తున్నాయని భావించిన స్వాతి... ఈ నెల 6న ఆన్లైన్లో రూ.36 వేల నగదును అతని అకౌంట్ కి బదిలీ చేశారు. ఆర్మీ వ్యాన్లో వస్తువులు ఇంటికి పంపిస్తామని చెప్పాడు. ఆరోజు సాయంత్రమైనా వస్తువులు రాలేదు. ఫోన్ చేస్తే స్విచాఫ్ అని వచ్చింది. మరుసటి రోజు గుంటూరులోని ఆర్మీ కార్యాలయానికి వెళ్లి విచారించగా ఆ పేరు గల వ్యక్తి , ఫోన్ నెంబర్ తమ కార్యాలయంలో లేదని అక్కడి అధికారులు తెలిపారు. మోసపోయామని గ్రహించిన భాదితురాలు స్వాతి భర్తతో కలసి గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు.
ఓఎల్ఎక్స్ పేరుతో మోసం..పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు
గుంటూరులో ఓఎల్ఎక్స్లో వస్తువులు పెట్టి ఓ వ్యక్తి మోసం చేశాడు. ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాను అంటూ నమ్మించి వారి దగ్గరి నుంచి డబ్బులను తన ఖాతాలో వేయించుకున్నాడు. బాధితులు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
గుంటూరులో ఓలెక్స్లో వస్తువులు పెట్టి ఓ వ్యక్తి మోసం
ఇదీ చూడండి.రాగల 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు