ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

murder: కత్తితో దాడి.. బాలుడు మృతి.. - mupala boy murder case latest news

14 ఏళ్ల బాలుడిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా ముప్పాళ్ల పట్టణంలో జరిగింది.

boy murder case
బాలుడి హత్య కేసు

By

Published : Jul 22, 2021, 10:33 PM IST

గుంటూరు జిల్లా ముప్పాళ్లలో దారుణం జరిగింది. పఠాన్‌ అఫ్రిద్‌ అనే 14 ఏళ్ల బాలుడిని షేక్‌ బాజి అనే వ్యక్తి కత్తితో పొడిచాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబసభ్యులు నరసరావుపేటలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అఫ్రిద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మరణించాడు. రెండు రోజుల క్రితం బాజి తమ్ముడి కుమారుడితో అఫ్రిద్‌కు గొడవైంది. ఆ విషయం బాజీకి తెలవడంతో.. అఫ్రిద్‌ కనిపించగానే కత్తితో దాడి చేశాడని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details