ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 12, 2019, 6:33 PM IST

ETV Bharat / state

గుంటూరులో కాజల్ అగర్వాల్ సందడి

గుంటూరు జిల్లా నరసరావుపేటలో సినీ నటి కాజల్ అగర్వాల్ సందడి చేసింది. స్వాతి షాపింగ్​ మాల్ అనే వస్త్ర దుకాణాన్ని ఆమె ప్రారంభించారు. ఈమెను చూసేందుకు ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.

a film actress Kajal Aggarwal came to Narasaraopet for opening swathi fashion shopping mall at guntur
గుంటూరులో కాజల్ అగర్వాల్ సందడి..అందుకోసమే..!

గుంటూరులో కాజల్ అగర్వాల్ సందడి

గుంటూరు జిల్లా నరసరావుపేటలో సినీ నటి కాజల్ అగర్వాల్ సందడి చేశారు. పట్టణంలోని కోట సెంటర్​లో ఏర్పాటు చేసిన స్వాతి షాపింగ్ మాల్ అనే ఓ వస్త్ర దుకాణాన్ని ఆమె ప్రారంభించారు. నరసరావుపేట రావడం చాలా ఆనందంగా ఉందని కాజల్​ తెలిపారు. గతంలో ఈ సంస్థకు చెందిన రెండు దుకాణాలను చీరాల, గుంటూరు పట్టణంలో తనే ప్రారంభించానని చెప్పారు. కొనుగోలుదారులకు స్వాతి సంస్థ అనేక రకాల ఆఫర్లను ఇస్తోందన్నారు. జిల్లా ప్రజల అభిమానం తనకెప్పుడూ సంతోషాన్నిస్తుందన్నారు. ఈ ముద్దుగుమ్మను చూసేందుకు పట్టణానికి చెందిన ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఎలాంటి తొక్కిసలాట జరగకుండా ఒకటో పట్టణ పోలీసులు పర్యవేక్షించారు.

ABOUT THE AUTHOR

...view details